Nehemiah 10:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు. “మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసుకుంటామని మేమంతా ప్రమాణం చేశాము!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి. “మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.”