Nehemiah 11:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వీరి సోదరులు ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఆలయ సేవకులు, యెరోహాము కొడుకు అదాయా (యెరోహాము పెలల్యా కొడుకు, పెలల్యా అమ్జీ కొడుకు, అమ్జీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కియా కొడుకు),
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అమ్జీ పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆలయ పని చేసే వీరి బంధువులు 822 మంది; అదాయా, ఇతడు మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన జెకర్యా కుమారుడైన అమ్జీకు పుట్టిన పెలల్యా కుమారుడైన యెరోహాము కుమారుడు.