Nehemiah 11:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మల్కియా సోదరులు రెండువందల నలభై రెండు మంది (వీళ్లు తమతమ కుటుంబాల పెద్దలు) అజరేలు కొడుకు అమష్షయి (అజరేలు అహాజయి కొడుకు, అహాజయిమెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమెతు ఇమ్మేరు కొడుకు),
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పెద్దలలో ప్రధాను లైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కుటుంబ పెద్దలుగా ఉన్న వీరి బంధువులు 242 మంది. అమష్షయి, ఇతడు ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమోతుకు పుట్టిన అహజై కుమారుడైన అజరేలు కుమారుడు.