Nehemiah 11:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజు నిర్దేశించిన పనులు యేమిటో జనులకు చెప్పినవాడు పెతహయా (పెతహయా మెషెబెయేలు కొడుకు. మెషెబెయేలు జెరహు వంశీయుడు. జెరహు యూదా కొడుకు).
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజబెయేలు కుమారుడగు పెతహయా జనులనుగూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా కుమారుడైన జెరహు వారసులలో ఒక్కడైన మెషేజబేలు కుమారుడైన పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో రాజుకు సలహాదారునిగా ఉన్నాడు.