Nehemiah 11:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెరూష లేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివ సించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజ కులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెరూషలేములో నివసించిన నాయకులెవరనగా: (కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలోమోను సేవకుల వంశీయులు యూదా పట్టణాల్లో నివసించారు. ఆయా పట్టణాల వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత భూమిమీద ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెరూషలేములో స్థిరపడిన ప్రాంతీయ నాయకులు వీరే, (ఇశ్రాయేలీయులలో కొంతమంది, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు యూదా పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న తమ సొంత స్థలాల్లో నివసించారు,