Nehemiah 12:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేవీయుల నాయకులు వీళ్లు: షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవా, వాళ్ల సోదరులు. వాళ్ల సోదరులు వీళ్లకి ఎదురుగా నిలబడి దైవ స్తోత్రాలు, భజన పాటలు పాడేవారు. ఒక బృందం మరో బృందానికి సమాధానంగా పాడుతుంది. దేవుని ప్రతినిధి అయిన దావీదు ఆదేశించిన రీతిలో ఈ స్తుతిపాటలు సాగుతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదుయొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేవీయుల నాయకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కుమారుడైన యెషూవ, వారి బంధువులు దైవజనుడైన దావీదు నిర్దేశించిన ప్రకారం వంతులవారీగా ఎదురెదురుగా నిలబడి కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడడానికి నియమించబడ్డారు.