Nehemiah 12:36 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని బంధు వులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారిముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అంతేకాక ఆసాపు సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, యూదా, హానానీ. వాళ్ల దగ్గర దైవ జనుడయిన దావీదు తయారు చేసిన సంగీత వాద్యాలు వున్నాయి. ఉపదేశకుడైన ఎజ్రా ప్రాకారానికి ప్రతిష్ఠ చేసే బృందానికి అగ్రభాగాన నడిచాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు.