Nehemiah 12:47 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జెరుబ్బాబెలు దినములలో నేమి నెహెమ్యా దినములలో నేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకుల కును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విధంగా, జెరుబ్బాబెలు, నెహెమ్యాల కాలంలో, ఇశ్రాయేలు ప్రజలందరూ గాయకుల, ద్వార పాలకుల సహాయార్థం ప్రతిరోజూ ఏదో ఒకటి ఇస్తూనే వుండేవారు. జనం కూడా తదితర లేవీయుల కోసం ఏదోఒకటి, ఎంతో కొంత కేటాయించేవారు. పోతే, లేవీయులు అహరోను వంశీకుల (యాజకుల) కోసం కొంత సొమ్ము కేటాయించేవారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే జెరుబ్బాబెలు, నెహెమ్యా సమయంలో ఇశ్రాయేలీయులందరు సంగీతకారులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహారం ఇచ్చేవారు. అలాగే ఇతర లేవీయులకు కూడా ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. లేవీయులు అహరోను వారసులకు ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు.