Nehemiah 13:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను వారిని గద్దించి వారితో ఇట్లంటినిమీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని–మీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమునవారు మరి రాలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే నేను వెళ్లి వారిని గద్దించి, “మీరు రాత్రంతా గోడ దగ్గర ఎందుకు ఉన్నారు? మరోసారి ఇలా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను” అని చెప్పాను. అప్పటినుండి వారు మళ్ళీ విశ్రాంతి దినాన రాలేదు.