Nehemiah 2:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి దిక్కున సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి వున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాత్రివేళలో నేను లోయ ద్వారం గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను.