Nehemiah 4:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు ఆ కాలమందు నేను జనులతోప్రతివాడు తన పని వానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు నేను వాళ్లకి ఈ విషయాలు కూడా చెప్పాను: “ప్రతి ఒక్క తాపీవాడూ, అతని సహాయకుడూ రాత్రివేళ యెరూషలేములోనే వుండిపోవాలి. అప్పుడు వాళ్లు రాత్రుళ్లు కాపలాదార్లుగా, పగళ్లు పని వాళ్లుగా ఉండగలుగుతారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఆ కాలమందు నేను జనులతో— ప్రతివాడు తన పనివానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో నేను ప్రజలతో, “ప్రతి వ్యక్తి తన పనివారితో కలసి రాత్రివేళ యెరూషలేములోనే ఉండాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపలాగా ఉంటారు, పగలు పని చేస్తారు” అని చెప్పాను.