Nehemiah 5:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించిమీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుంబాల దగ్గరికీ, ఉద్యోగుల వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించుకొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట సమావేశ పరచి,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి–మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి,