Nehemiah 9:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవెంతో దయామయుడివి! అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు. పగటివేళ మేఘస్థంభాన్ని వాళ్లనుంచి తప్పించలేదు. వాళ్లని నడిపిస్తూనే వచ్చావు. రాత్రివేళ దీపస్తంభాన్ని వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు. వాళ్ల బాటకి వెలుగు చూపుతూనే వచ్చి వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మీ గొప్ప కనికరాన్ని బట్టి ఎడారిలో మీరు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభం దారి చూపడం ఆపలేదు; రాత్రి అగ్నిస్తంభం వారి మార్గాలకు వెలుగివ్వడం మానలేదు.