Nehemiah 9:37 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మా పాపములనుబట్టి నీవు మామీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫల మిచ్చుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ భూమిలో పంట పుష్కలమైనదే కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది. ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు. తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు. దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.