Numbers 14:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమా రులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా ప్రేమమూర్తి. యెహోవా పాపాన్ని, దోషాన్ని తీసివేస్తాడు. అయితే నేరస్థులను యెహోవా ఎప్పుడూ శిక్షిస్తాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలకుకూడా యెహోవా పిల్లల్ని శిక్షిస్తాడు. వారి తాత ముత్తాతల పాపాలకు యెహోవా పిల్లల్నికూడ శిక్షిస్తాడు’ అని నీవు చెప్పావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’