Numbers 16:47 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే చెప్పినట్లే అహరోను చేశాడు. ధూపార్తులతో సమాజం మధ్యకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పటికే ప్రజల్లో తెగులు మొదలయ్యింది కానీ అహరోను ధూపం వేసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.