Numbers 23:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు బాలాకుదయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు బాలాకు–దయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడునుగాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు బాలాకు అతనితో, “వారు కనిపించే మరో చోటికి నాతో రా; వారందరిని చూడవు కానీ, వారి శిబిరం సరిహద్దులు చూస్తావు. అక్కడినుండి నా కోసం వారిని శపించు” అని అన్నాడు.