Numbers 29:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ”