Numbers 3:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే నాదాబు, అబీహు యెహోవాను సేవిస్తూనే పాపంచేసారు గనుక వారు చనిపోయారు. వారు యెహోవాకు ఒక అర్పణ తయారు చేసారు కాని, యెహోవా అనుమతించని అగ్నిని వారు ఉపయోగించారు. ఇది సీనాయి అరణ్యంలో సంభవించింది. కనుక నాదాబు, అబీహు అక్కడే చనిపోయారు. వారికి కుమారులు లేనందుచేత ఎలియాజరు, ఈతామారు యాజకులై యెహోవాను సేవించారు. వారి తండ్రి అహరోను జీవించి ఉండగానే వారు ఇలా చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందునవారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాదాబు అబీహులు సీనాయి అరణ్యంలో యెహోవా ఎదుట అనధికార అగ్నితో అర్పణ అర్పించినందుకు ఆయన ఎదుటే చనిపోయారు. వారికి కుమారులు లేరు కాబట్టి అహరోను జీవితకాలమంతా, తన కుమారులైన ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.