Numbers 30:5 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసిన యెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టు కొనిన బాధ్యతలో ఏదియు నిలువక పోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే ఆమె తండ్రి ఆ ప్రమాణం గూర్చి విని, ఒప్పుకొనకపోతే, అప్పుడు ఆ యువతి తన ప్రమాణానికి బాధ్యురాలు కాదు. ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె నెరవేర్చాల్సిన పనిలేదు. ఆమె తండ్రి ఆమెను వారించాడు గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే, తన తండ్రి దాని గురించి విని ఒప్పుకోకపోతే, అప్పుడు ఆ యువతి చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఏవి కూడా నిలువవు; తన తండ్రి ఒప్పుకోలేదు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తారు.