Numbers 31:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టినవారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసరే, నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపెట్టినవారును మూడవదినమున ఏడవదినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఎవరైనా ఎవరినైన చంపినా, లేదా చంపబడిన వారిని తాకినా, తాకినవారు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడవ రోజున ఏడవ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ బందీలను కూడా శుద్ధి చేయాలి.