Numbers 35:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చనిపోయిన వాని కుటుంబంలో వారు ఎవరైనా తిరిగి అతడిని చంపవచ్చేమో సమాజపు న్యాయస్థానం నిర్ణయించాలి. న్యాయస్థానం హంతకుడిని బ్రతకనివ్వాలని ఒకవేళ నిర్ణయిస్తే, అప్పుడు ఈ వ్యక్తి తన ‘ఆశ్రయపురానికి’ వెళ్లాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడే ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజమువాడు పారిపోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను.వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధానయాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సమాజం ఆ నిందితుడిని పగతీర్చుకునే వాని నుండి కాపాడి తిరిగి అతడు పారిపోయిన ఆశ్రయపురానికి పంపించాలి. నిందితుడు పరిశుద్ధ నూనెతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉండాలి.