Numbers 36:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారి నెవరినైనను పెండ్లిచేసికొనిన యెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహాదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు ఆ భూమిని తీసుకుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టుకుంటామా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రములవారి నెవరినైనను పెండ్లిచేసికొనినయెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకవేళ వారు ఇతర ఇశ్రాయేలు గోత్రం వారిని పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వారి వారసత్వం పూర్వికుల గోత్రం నుండి మారి వేరే వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది. కాబట్టి వారి వారసత్వం లోని భాగం తీసివేయబడుతుంది.