Numbers 6:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అనగా అతడు మరల ప్రత్యేకంగా ఉండేందుకు తనను యెహోవాకు అర్పించుకోవాలని దీని అర్థం. ఒక సంవత్సరం వయసు గల ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకురావాలి. అపరాధ పరిహారార్థ బలిగా అతడు దీనిని ఇవ్వాలి. అతడు ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ మరచిపోవటం జరిగింది. అతడు మరల ప్రత్యేకంగా ఉండటం ప్రారంభించాలి. అతడు మొదటిసారి ప్రత్యేకంగా ఉన్నప్పుడు శవాన్ని ముట్టినందువల్ల ఇలా చేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు తాను ప్రత్యేకముగాఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుకమునుపటి దినములు వ్యర్థమైనవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ప్రత్యేకించుకున్న కాలాన్ని నియమించుకొని తిరిగి తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకుని ఒక ఏడాది గొర్రెపిల్లను అపరాధపరిహారబలి కోసం తేవాలి. ప్రత్యేకించుకున్న కాలంలో అపవిత్రులయ్యారు కాబట్టి మునుపటి రోజులు లెక్కకు రావు.