Numbers 6:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు నాజీ రగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అలా వేరుగా ఉండే కాలంలో అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అతడు వేరుగా ఉండాల్సిన రోజులు గడచిపోయేంతవరకు అతడు పవిత్రంగా ఉండాలి. అతడు తన వెంట్రుకలను పొడవుగా పెరగనివ్వాలి. అతడు దేవునికి చేసిన వాగ్దానంలో అతని తల వెంట్రుకలు ఒక భాగం. ఆ వెంట్రుకలను ఒక కానుకగా అతడు దేవునికి ఇస్తాడు. అందుచేత వేరుగా ఉండే సమయం అయిపోయేంత వరకు అతడు తన తల వెంట్రుకలను పొడవుగా పెంచాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు నాజీ రగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘నాజీరుగా మ్రొక్కుబడి చేసుకున్న కాలమంతా, వారి వెంట్రుకలు కత్తిరించకూడదు. తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకున్న కాలమంతా వారు ముగిసేవరకు పవిత్రులుగా ఉండాలి; వారి వెంట్రుకలు పెరిగేలా వదిలేయాలి.