Proverbs 23:35 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“వారు నన్ను కొట్టారు. కాని నాకేమీ అనిపించలేదు. వారు నన్ను కొట్టారు. కాని అది నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు నేను లేవలేను. నేను మరోసారి తాగాలి” అని నీవు చెబుతావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు! వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు! మరి కాస్త మద్యం త్రాగడానికి నేనెప్పుడు నిద్ర లేస్తాను?”