Proverbs 30:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవు–చాలును అని పలుకనివి నాలుగు కలవు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు: