Psalms 123:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచు నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు. బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు. అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము. దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.