Psalms 20:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియునురక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.