Psalms 22:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?