Psalms 32:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని –యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు.