Psalms 40:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడుచేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.