Psalms 71:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు. కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు. భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు, చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ, మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు; భూమి యొక్క లోతుల నుండి మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు.