Psalms 75:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది. ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు. దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మ్రింగివేయవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.