Revelation 13:10 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బంధింపబడవలసినవాడు బంధింపబడతాడు. కత్తితో వధింపబడవలసినవాడు వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“చెరలోనికి వెళ్లవలసినవారు చెరలోనికి వెళ్తారు. ఖడ్గంతో హతం కావలసిన వారు ఖడ్గంతో హతం అవుతారు.” ఇది దేవుని ప్రజలు తమ విశ్వాసానికి నమ్మకంగా ఉండి సహనాన్ని చూపించాల్సిన సమయం.