Revelation 9:19 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ గుఱ్ఱాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటితో అవి కాటువేసి బాధిస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ గుర్రాల బలం వాటి నోళ్ళలోనూ తోకల్లోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు తలలున్న పాముల్లా ఉన్నాయి. అవి వాటితో మనుషుల్ని గాయపరుస్తాయి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల్లా తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి.