Romans 15:12 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు: “యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది. ఆయన దేశాలను పాలిస్తాడు. యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు— యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.”