Romans 16:23 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మొత్తం సంఘానికి, నాకు ఆతిథ్యమిస్తున్న గాయి మీకు వందనాలు చెపుతున్నాడు. పట్టణ కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు మీకు వందనాలు తెలుపమన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నాకు, సంఘమంతటికీ ఆతిథ్యమిచ్చే గాయి మీకు అభివందనాలు చెబుతున్నాడు. ఈ పట్టణానికి కోశాధికారి ఎరస్తు, సోదరుడు క్వర్తు, మీకు అభివందనాలు చెబుతున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.