Ruth 3:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడుఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియ జేయకుడని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత తెల్లారేవరకు రూతు అతని కాళ్ల దగ్గరే పడుకొంది. తెల్లవారుఝామునే ఒకరినొకరు గుర్తించే పాటి వెలగు రాకముందే ఆమె లేచివెళ్లి పోయింది. “రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు ఆమెతో.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు–ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకుని, ఇంకా ఒకనిని ఒకరు గుర్తుపట్టేటంత వెలుగు రాకముందే లేచింది; “ఒక స్త్రీ నూర్పిడి కళ్ళం లోనికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు” అని బోయజు అన్నాడు.