Song of Solomon 4:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు క్రింద నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి.