Song of Solomon 5:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.