Zechariah 11:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరక బడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ వృక్షాలు విచారిస్తాయి. బలమైన ఆ చెట్లు దూరంగా తీసుకుపోబడ్డాయి. బాషానులోని సింధూర వృక్షాలు నరికి వేయబడిన అడవికొరకు దుఃఖిస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి, చిక్కని అడవి నరక బడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.