Zechariah 11:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధ కమనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెలపట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెలపట్ల శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధమనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు, ముఖ్యంగా మందలో బాధించబడిన వాటికి నేను కాపరిగా ఉన్నాను. రెండు కర్రలు పట్టుకుని కాపరిగా కాచాను. ఒక కర్రకు దయ అని, రెండవ కర్రకు బంధం అని పేరు పెట్టాను.