Zechariah 12:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృిష్టయుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలా పింతురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.