Zechariah 3:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను, పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు క్రింద, తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొనిపోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”