Zechariah 3:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక! నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
— సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవాదూత సాతానుతో అనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.