Zechariah 3:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను చెప్పిన విధంగా జీవించు. నేను చెప్పినవన్నీ చెయ్యి. నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు. నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు. ఇక్కడ నిలబడిన దేవదూతలవలె నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా — నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు నాకు లోబడి జీవిస్తూ, నా మార్గాలను పాటిస్తే, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాల మీద అధికారం కలిగి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉన్న వారి మధ్యలో నేను నీకు స్థానం ఇస్తాను.