Zechariah 5:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను,ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడు చున్నదంటిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. “నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, —ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడు చున్నదంటిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. నేను, “ఇరవై మూరల పొడవు, పది మూరల వెడల్పు కలిగి ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూస్తున్నాను” అని జవాబిచ్చాను.