Zechariah 7:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండు నట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు చాలా మొండి వైఖరి దాల్చారు. వారు న్యాయాన్ని పాటించరు. ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు. కాని ప్రజలు వాటిని వినలేదు. అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తమ హృదయాలను చెకుముకి రాయిలా గట్టిగా చేసుకున్నారు, సైన్యాల యెహోవా తన ఆత్మ ద్వారా పూర్వ ప్రవక్తలకు ఇచ్చిన ఉపదేశాన్ని, మాటలను వినలేదు. కాబట్టి సైన్యాల యెహోవా చాలా కోప్పడ్డారు.