Zechariah 8:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చిఆలస్యముచేయక యెహొ వాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారుమేమును వత్తుమందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక నగరంనుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు, వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు. ‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము. మాతో రండి!’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి–ఆలస్యముచేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు–మేమును వత్తుమందురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు.